Madanapalle: అక్టోబర్ 13న తిరుపతిలో దళిత దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలు
Madanapalle: అక్టోబర్ 13న తిరుచానూరులో దళిత దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభించనున్నట్లు మదనపల్లెలో మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ వెల్లడించారు.
Madanapalle: అక్టోబర్ 13న తిరుపతిలో దళిత దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలు
మదనపల్లె: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 13న తిరుచానూరులో దళిత దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ తెలిపారు. మదనపల్లె సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వంద సంవత్సరాల క్రితం తిరుచానూరు దేవాలయంలోకి ఓ దళితుడు ప్రవేశించగా పోలీసులు అరెస్టు చేశారని చింతా మోహన్ తెలిపారు. ఈ ఘటనకు నిరసనగా మహాత్మా గాంధీ తిరుచానూరు దేవాలయం ఎదుట సత్యాగ్రహం నిర్వహించారని పేర్కొన్నారు. ఆ చారిత్రక ఘటనకు స్మృతిగా అక్టోబర్ 13న తిరుచానూరులో దళిత దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
అనంతరం దేశవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల వద్ద విడతల వారీగా ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సామాజిక సమానత్వం, దేవాలయ ప్రవేశ హక్కు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు.
మదనపల్లెలో లక్ష కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంటూ అట్టహాసంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారని, ఆ ప్రాజెక్టు ద్వారా ఏమి జరుగుతుందో రాబోయే ఆరు నెలల్లో తెలుస్తుందని చింతా మోహన్ వ్యాఖ్యానించారు.
రైతులకు రుణమాఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. 12 సంవత్సరాల కాలంలో ఒక్క రైతుకైనా రూ.1,000 రుణం మాఫీ చేయని కేంద్ర ప్రభుత్వం, భారీగా రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వారికి లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు.
బీసీలకు 37 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చింతా మోహన్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ వైఖరిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




