Madanapalle: వీఆర్వో నిర్మల్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలి.. కలెక్టరేట్ వద్ద ధర్నా!
Madanapalle: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం బాధితురాలికి న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో నిరసన. వీఆర్వో సస్పెన్షన్‌కు డిమాండ్.
Madanapalle: వీఆర్వో నిర్మల్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలి.. కలెక్టరేట్ వద్ద ధర్నా!
Madanapalle: గాలివీడు మండలం ఎగువ గొట్టివేడు గ్రామం మావిళ్లపల్లిలో పేద మహిళ మావిళ్ల శ్రీదేవి సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ గ్రామ వీఆర్వో నిర్మల్‌కుమార్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ డిమాండ్ చేశారు. సోమవారం మదనపల్లె జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ, రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మావులూరి విశ్వనాథ్, చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మావిళ్ల శ్రీదేవి అప్పోసప్పో చేసి సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారని తెలిపారు. అయితే కొంతమంది వ్యక్తులు ఆమె ఇంటి ముందు కాంపౌండ్ గోడ నిర్మించి బయటకు రాకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యపై ఏడాది కాలంగా రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా పరిష్కారం కాలేదన్నారు.
వీఆర్వో నిర్మల్‌కుమార్‌పై బాధితురాలు తహసీల్దార్, ఆర్డీవో, జేసీలకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి బాధితురాలు శ్రీదేవికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్వో నిర్మల్‌కుమార్‌తో పాటు సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని, వీఆర్వోను సస్పెండ్ చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బాధితురాలు మావిళ్ల శ్రీదేవి, మావిళ్ల నాగార్జున, వేణుగోపాల్, వీరమల్లమ్మ, కదిరప్ప, బాబు, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.




