Madanapalle: అగ్రికల్చరల్ హబ్ ఏర్పాటుపై కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ విమర్శలు!

Madanapalle: అక్టోబర్ 2న మదనపల్లెలో సీఎం చంద్రబాబు, నిర్మలా సీతారామన్ పర్యటనపై కాంగ్రెస్ నాయకుడు రెడ్డి సాహెబ్ ఘాటు విమర్శలు.

Srinivasulu, Madanapalle
Published on: 30 Sept 2026 12:38 PM IST
Madanapalle
X

Madanapalle: అగ్రికల్చరల్ హబ్ ఏర్పాటుపై కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ విమర్శలు!

Madanapalle: అక్టోబర్ 2న మదనపల్లెలో అగ్రికల్చరల్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అనంత్ అంబానీ తదితరులు విచ్చేయనున్న నేపథ్యంలో సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అయితే అగ్రికల్చరల్ హబ్‌కు సంబంధించి ఇప్పటివరకు జిల్లా పరిపాలన, కలెక్టర్ కార్యాలయం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని మదనపల్లె నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాల్సిన అభివృద్ధి, కార్యకలాపాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ప్రభుత్వమే ఖర్చులు భరించి, ఆదాయం మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు వెళ్లే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల కష్టార్జిత సొమ్ము, ప్రజల భూములను ఇతర వ్యక్తులకు అప్పగించడమే అభివృద్ధి కాదని అన్నారు. అగ్రికల్చరల్ హబ్ ద్వారా మదనపల్లె ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, వర్షాలు తక్కువగా ఉండే రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెబితే తాము స్వాగతిస్తామని తెలిపారు. అయితే ఆ పేరుతో రైతులకు, ప్రజలకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తామని రెడ్డి సాహెబ్ హెచ్చరించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle