Madanapalle: మదనపల్లెలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కలెక్టర్‌కు వినతిపత్రం!
Madanapalle: ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గుప్తా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మదనపల్లెలో అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Madanapalle: మదనపల్లెలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కలెక్టర్‌కు వినతిపత్రం!
Madanapalle: ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గుప్తా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజుల భాస్కర్ మాట్లాడుతూ.. ప్రజలను మభ్యపెడుతూ ఓటు అనే వజ్రాయుధాన్ని దొడ్డిదారిన ఉపయోగించుకునే విధంగా ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గుప్తా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.




