Chittoor: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామాకు కాంగ్రెస్ నిరసన!
Chittoor: చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన చేపట్టారు.
Chittoor: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామాకు కాంగ్రెస్ నిరసన!
Chittoor: భారత ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఏఐసీసీ కార్యదర్శి గణేష్ కుమార్ యాదవ్, పాలక్ వర్మ మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్ డిమాండ్ చేశారు.ఈ మేరకు బుధవారం అంబేద్కర్ విగ్రహం వద్ద చిత్తూరు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో 13 కోట్ల ఓట్లకు పైన అక్రమంగా తొలగించి,కోట్లాది దొంగబాట్లను జాబితాలో చేర్చిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలని,డిమాండ్ చేశారు.
కేంద్రంలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్న బిజెపి ప్రభుత్వానికి తొత్తుగా మారి ఈ ఎన్నికల ఓట్ల చోరీకి పాల్పడ్డారని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఓట్ల చోరీతో 2024 లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడం జరిగిందన్నారు. అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను ఊరేగించారు.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు టిక్కీ రాయల్, తదితరులు పాల్గొన్నారు.




