Chittoor: స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం.. కలెక్టర్ సుమిత్ కుమార్!
Chittoor: చిత్తూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
Chittoor: స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం.. కలెక్టర్ సుమిత్ కుమార్!
Chittoor: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 13,06,725 మంది ఓటర్లు ఉన్నారని, ఎన్నికల విధుల కోసం సుమారు 10 వేల మంది సిబ్బందిని నియమించనున్నట్లు వెల్లడించారు.
చిత్తూరు, నగరి, పలమనేరు,కుప్పం నాలుగు మున్సిపాలిటీలతో పాటు 619 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.ఫిర్యాదుల కోసం కలెక్టరేట్లో 1800 425 4901 నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ తుషార డూడి మాట్లాడుతూ..ఎన్నికల భద్రత కోసం 1,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.సున్నిత ప్రాంతాల్లో అదనపు భద్రత, సరిహద్దు చెక్పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. అక్రమ మద్యం, నగదు పంపిణీ,ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలపై ప్రత్యేక నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.




