Rayachoti: మంత్రులకు ఘన స్వాగతం పలికిన కలెక్టర్ నిశాంత్ కుమార్

Rayachoti: రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలను కలెక్టర్ నిశాంత్ కుమార్ కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 29 Sept 2026 9:43 PM IST
Rayachoti
X

Rayachoti: మంత్రులకు ఘన స్వాగతం పలికిన కలెక్టర్ నిశాంత్ కుమార్

Rayachoti: మంగళవారం రాత్రి రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్ కి విచ్చేసిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారిని, రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి, జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

ఈ సందర్భంగా స్టేట్ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టరుతో కొద్దిసేపు సమావేశమై. అక్టోబర్ రెండున జిల్లాకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు కేంద్ర మంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లు మరియు జిల్లా అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI