Chittoor: కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన!

Chittoor: కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన. జలహారతి కార్యక్రమంలో భాగస్వామ్యం, పౌల్ట్రీ రైతులతో సమావేశం మరియు టీడీపీ నాయకులతో ముఖాముఖి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Sept 2026 10:27 AM IST
Chittoor
X

Chittoor: కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన!

Chittoor: చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగనుంది. శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి వద్ద కృష్ణా జిల్లాలకు జలహారతి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం కడపల్లి వద్ద పౌల్ట్రీ రైతులతో సమావేశమై వారి సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు.

మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి కుప్పం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే అధికారులు, రైతులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం శాంతిపురం మండలం తుమ్మిసి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణం కానున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్