Chowdepalle: చౌడేపల్లిలో ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం రూ. 50 వేల నష్టం!

Chowdepalle: చౌడేపల్లి బత్తలాపురం రోడ్డులో ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైంది. పుంగనూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.

MAHESH, PUNGANOOR
Published on: 12 Aug 2026 4:11 PM IST
Chowdepalle
X

Chowdepalle: చౌడేపల్లిలో ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం రూ. 50 వేల నష్టం!

Chowdepalle: చౌడేపల్లి మండలంకేంద్రం బత్తలాపురం రోడ్డులో బుధవారం ప్రమాదవశాత్తు గడ్డివాముకు నిప్పు అంటుకుని అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సుమారు రూ 50వేలు రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.

బాధితుడు ఎస్. సయ్యద్ బాషాకి చెందిన గడ్డి వాముకు మంటలు అంటుకున్నట్లు పుంగనూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే ఇన్చార్జి కేంద్రాధికారి కే. సురేష్ బాబు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటర్ ట్యాంకర్ సహాయంతో మంటలను పూర్తిగా అదుపు చేసి ఆర్పేశారు.

గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా బీడీ లేదా సిగరెట్ తాగి ఆర్పకుండా పడేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఆర్పే చర్యల్లో ఫైర్ సిబ్బంది ఈ. సుబ్రమణ్యం, ఎమ్. లోకేష్ రెడ్డి, వి. కేశవ, కే. మోహన్ బాబులు పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story