Chowdepalle: మరువలేని జ్ఞాపకం చౌడేపల్లి ZPHS పూర్వ విద్యార్థుల సమ్మేళనం!

Chowdepalle: అన్నమయ్య జిల్లా చౌడేపల్లి జెడ్పీ హైస్కూల్ 1968-69 ఎస్ఎస్ఎల్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు 57 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక జరుపుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

MAHESH, PUNGANOOR
Published on: 27 Sept 2026 7:34 PM IST
Chowdepalle
X

Chowdepalle: మరువలేని జ్ఞాపకం చౌడేపల్లి ZPHS పూర్వ విద్యార్థుల సమ్మేళనం!

Chowdepalle: చౌడేపల్లి ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్సి 1968-69 పోలోపు విద్యార్థుల అపూర్వ కలయిక జరిగింది దాదాపు 57 సంవత్సరాల తర్వాత అందరూ కలుసుకొని ఒకరినొకరు క్షేమ సమాచారం తెలుసుకున్నారు తాము విద్యను అభ్యసించిన ప్రదేశంలో 70 ఏళ్ళు దాటిన వయసులో కలుసుకోవడం ఎంతో ఆదర్శంగా భావించారు.

చిన్నప్పుడు తాము చేసిన చాస్టాలను గురువులను ఆటపట్టించిన తీరును విద్యను అభ్యసించి మంచి స్థానాలకు వెళ్లి స్థిరపడ్డ విషయాలను గుర్తు చేసుకున్నారు అదేవిధంగా తాము చదివిన పాఠశాలకు ఎంతో మేలు చేయాలని అనుకున్నారు ముదిమి వయసులో అందరూ కలిసిపోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని వారు అనుకున్నారు అనంతరం అందరూ కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉమాశంకర్ రెడ్డి ఉపాధ్యాయులు 1968-69 పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR