Chittoor: చిత్తూరు జడ్పీ ప్రమాణ స్వీకారం.. మురళీమోహన్ శుభాకాంక్షలు
Chittoor: చిత్తూరు జడ్పీ చైర్‌పర్సన్‌గా మందలపు శైలజ, వైస్ చైర్‌పర్సన్‌గా మంజుప్రియ, జడ్పీటీసీల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
Chittoor: చిత్తూరు జడ్పీ ప్రమాణ స్వీకారం.. మురళీమోహన్ శుభాకాంక్షలు
చిత్తూరు: చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన నూతన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మరియు జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్.
చిత్తూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన శ్రీమతి మందలపు శైలజ ,వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన శ్రీమతి ఎస్. మంజుప్రియ వెంకటేష్ మరియు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులందరికీ పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమర్నాథ్ రెడ్డి , శాసనమండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ,మరియు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ తో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




