Chittoor: ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి జడ్పీటీసీ అభ్యర్థి జయంతి

Chittoor: చిత్తూరు రూరల్ చెర్లోపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి జయంతి, ఎంపీటీసీ అభ్యర్థి మురుగేష్ ఇంటింటి ప్రచారం. ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని పిలుపు.

Chandra Sekhar, Chittoor
Published on: 2 Nov 2026 5:29 PM IST
Chittoor
X

Chittoor: ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి జడ్పీటీసీ అభ్యర్థి జయంతి

చిత్తూరు: చిత్తూరు రూరల్ మండలం చెర్లోపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సోమవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి జయంతి, ఎంపీటీసీ అభ్యర్థి మురుగేష్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.

రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థి జయంతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎంసీ విజయానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు.

తనకు లభించిన అవకాశాన్ని ప్రజలకు సేవ చేసేందుకు వినియోగించుకుంటానని పేర్కొన్నారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని వారు విమర్శించారు.గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి పలువురు స్థానికులు స్వాగతం పలికి తమ మద్దతు తెలియజేయడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

ప్రజల ఆదరణతో అభ్యర్థులు విజయం సాధిస్తారనే నమ్మకం ఉందని ఎంపీటీసీ అభ్యర్థి మురుగేష్ ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు త్యాగరాజులు, శ్యామ్, మాజీ ఎంపీటీసీ ప్రతిమ, మాజీ సింగిల్‌విండో చైర్మన్ కన్నన్, సుబ్రహ్మణ్యం, రాజశేఖర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, దేవేంద్రరెడ్డి, పురుషోత్తం, శంకర్‌ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor