Chittoor: ఘనంగా ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం - ఉచిత వైద్య శిబిరం
Chittoor: చిత్తూరు ఏకే అమ్మ ఆసుపత్రిలో ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవ వేడుకలు. ఉచితంగా ఊపిరితిత్తుల పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసిన వైద్యులు.
Chittoor: ఘనంగా ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం - ఉచిత వైద్య శిబిరం
చిత్తూరు: ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవాన్ని చిత్తూరు నగరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక ఏకే అమ్మ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి దాదాపు 200 మందికి పైగా బాధితులు హాజరై తమ ఊపిరితిత్తుల పనితీరును ఉచితంగా నిర్వహించిన పరీక్షల ద్వారా నిర్ధారించుకున్నారు. ఈ సందర్భంగా వైద్యశాల నిర్వహకులు డాక్టర్ అశోక్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ తరచు తమ శరీరంలోని ఇతర అవయవాలతో పాటు, ఊపిరితిత్తుల పనితీరును సైతం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, గంజాయి, మాదకద్రవ్యాలు ( డ్రగ్స్ ) ను వినియోగించే వారు ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలను చేసుకోవాలని సూచించారు. అనంతరం పరీక్షలు చేసుకున్న వారికి మందులను సైతం ఉచితంగా పంపిణీ చేశారు. కాగా ఈ కార్యక్రమంలో ఏకే అమ్మ హాస్పిటల్స్ సహ నిర్వాకులు డాక్టర్ కళ్యాణ్ బాబు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జయశ్రీ, పలువురు టెక్నీషియన్లు, వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




