Chittoor: ఎక్కడ సమస్య ఉంటే అక్కడికే వెళ్లి తీరుస్తా – జేసీ లితీష్!

Chittoor: చిత్తూరు 3వ డివిజన్ కార్పొరేటర్ జేసీ లితీష్ కుమార్ ఇంటింటి ప్రచారం. మేయర్ అభ్యర్థి కటారి హేమలత విజయం కోసం సైకిల్ గుర్తుపై ఓటేయాలని అభ్యర్థన.

Chandra Sekhar, Chittoor
Published on: 28 Oct 2026 5:44 PM IST
Chittoor
X

Chittoor: ఎక్కడ సమస్య ఉంటే అక్కడికే వెళ్లి తీరుస్తా – జేసీ లితీష్!

చిత్తూరు: డివిజన్ పరిధిలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారి వద్దకే వెళ్లి, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని చిత్తూరు నగరంలోని మూడో డివిజన్ కార్పొరేటర్ జె.సి. లితీష్ కుమార్ తెలిపారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని ఆయన పేర్కొన్నారు.

బుధవారం చిత్తూరు నగరంలో టీడీపీ మేయర్ అభ్యర్థి కటారి హేమలత చేపట్టిన డివిజన్ల పర్యటనలో లితీష్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమెతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచి, సైకిల్ గుర్తుకు ఓటు వేసి కటారి హేమలతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా లితీష్ కుమార్ మాట్లాడుతూ, మూడో డివిజన్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. డివిజన్ పరిధిలోని ప్రతి కుటుంబానికి ఒక కొడుకులా అండగా ఉంటానని, ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చే సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అవసరమైతే సొంత నిధులతోనైనా ప్రజా సమస్యల పర

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor