Chittoor: కూటమి పాలనకు స్వస్తి చెప్పాలి విజయానంద రెడ్డి!

Chittoor: చిత్తూరులో 5 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి ఆర్. చంద్రశేఖర్ తరఫున ఎంసీ విజయానంద రెడ్డి ప్రచారం. కూటమి పాలనకు ముగింపు పలకాలని పిలుపు.

Chandra Sekhar, Chittoor
Published on: 26 Oct 2026 6:56 PM IST
Chittoor
X

Chittoor: కూటమి పాలనకు స్వస్తి చెప్పాలి విజయానంద రెడ్డి!

చిత్తూరు: కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలకు ముగింపు పలకాలంటే చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి ఆర్. చంద్రశేఖర్‌ను గెలిపించాలని ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎంసీ విజయానంద రెడ్డి కోరారు.

సోమవారం నగరంలోని 39, 40, 34, 35, 36వ డివిజన్లలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా ఓటర్లను కలిశారు.ఈ సందర్భంగా విజయానంద రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిస్తేనే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయగలమన్నారు.

గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలపాలని కోరారు. ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మునీర్, మున్నా, అలీ, నరేష్, అంజలి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor