Chittoor: 2వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా – డి. ఉదయ్ కుమార్!

Chittoor: చిత్తూరు మురుకంబట్టు 2వ డివిజన్ ఏకగ్రీవ కార్పొరేటర్ డి. ఉదయ్ కుమార్ ప్రచారం. కూటమి మేయర్ అభ్యర్థి కటారి హేమలత విజయం కోసం సైకిల్ గుర్తుపై ఓట్లకు విజ్ఞప్తి.

Chandra Sekhar, Chittoor
Published on: 28 Oct 2026 5:48 PM IST
Chittoor
X

Chittoor: 2వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా – డి. ఉదయ్ కుమార్!

చిత్తూరు: చిత్తూరు నగరంలోని మురుకంబట్టు రెండో డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన కార్పొరేటర్ డి. ఉదయ్ కుమార్ తెలిపారు.

బుధవారం డివిజన్ పరిధిలో తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థి కటారి హేమలతకు మద్దతుగా స్థానిక నాయకులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి నగర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ డి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, ఇప్పటికే ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో రెండో డివిజన్‌లో రూ.75 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. డివిజన్‌లో మిగిలి ఉన్న మౌలిక వసతుల సమస్యలను గుర్తించి, వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రజలకు అవసరమైన తాగునీరు, రహదారులు, డ్రైనేజీ తదితర సదుపాయాలను మెరుగుపరిచి, డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor