Chittoor: వృద్ధుల ఒంటరితనాన్ని దూరం చేసే యాప్‌కు ప్రథమ బహుమతి!

Chittoor: వృద్ధాశ్రమాల్లోని పెద్దల ఒంటరితనాన్ని తగ్గించే యాప్ ఆలోచనకు చిత్తూరు ది అపోలో యూనివర్సిటీ విద్యార్థినులు అన్వేషణ్‌–2026 సదస్సులో ప్రథమ బహుమతి సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.

Chandra Sekhar, Chittoor
Published on: 16 Nov 2026 4:26 PM IST
Chittoor
X

Chittoor: వృద్ధుల ఒంటరితనాన్ని దూరం చేసే యాప్‌కు ప్రథమ బహుమతి!

చిత్తూరు: వృద్ధాశ్రమాల్లో నివసించే పెద్దల ఒంటరితనాన్ని తగ్గించి, వారికి ఆత్మీయంగా తోడ్పడే యాప్ రూపకల్పన ఆలోచనకు ది అపోలో యూనివర్సిటీ విద్యార్థినులు ప్రథమ బహుమతి సాధించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నవంబర్ 13, 14 తేదీల్లో నిర్వహించిన అన్వేషణ్‌–2026 దక్షిణ మండల విద్యార్థుల పరిశోధనా సదస్సులో ఈ ఘనత సాధించారు.

అపోలో యూనివర్సిటీ బయోమెడికల్ సైన్సెస్ విభాగానికి చెందిన బి.ఎస్సీ బయోటెక్నాలజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ఎ. నాగ హర్షిణి రెడ్డి, జి. వి. ఎన్. ఎస్.హెచ్. సృజన, పాలిగిరి సాయి గ్రీష్మ, షేక్ సమియా ఈ యాప్ ఆలోచనను రూపొందించారు.

ఈ యాప్ ద్వారా యువత వృద్ధులతో ఫోన్‌లో లేదా నేరుగా మాట్లాడి, వారి ఆరోగ్యం, అభిరుచులు, భావోద్వేగ స్థితిగతులను తెలుసుకుంటూ మానసికంగా అండగా నిలవవచ్చు. ఈ విజయంతో విద్యార్థినులు దక్షిణ భారతదేశం తరఫున జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు.

ఈ సందర్భంగా నీతి ఆయోగ్‌కు చెందిన డా. వి.కె. సారస్వత్‌తో పాటు అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డా. నితిన్ ఎం. నాగార్కర్, ఇతర అధ్యాపకులు విద్యార్థినులను అభినందించారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor