Chittoor: తమ పట్టా భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని దళితుల ఆవేదన!
Chittoor: చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం కరణంవాండ్లఊరు దళితవాడకు చెందిన తమ పట్టా భూమిని ఆక్రమించేందుకు కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని బాధితులు ప్రెస్‌క్లబ్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
Chittoor: తమ పట్టా భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని దళితుల ఆవేదన!
చిత్తూరు: తమ పట్టా భూమిని ఆక్రమించేందుకు కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తవణంపల్లి మండలం కరణంవాండ్లఊరు దళితవాడకు చెందిన బాధితులు ఆరోపించారు. ఆదివారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. నలిశెట్టిపల్లి లెక్క దాఖలాలోని సర్వే నంబర్ 178/2లో తమ పట్టా భూములకు కంచె ఏర్పాటు చేసుకుని రక్షణగా ఉంచుకున్నామని తెలిపారు.
అయితే ఈ నెల 11వ తేదీ రాత్రి బీసీ కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు కంచెను తొలగించి భూమిని ఆక్రమించేందుకు యత్నించారని ఆరోపించారు. అడ్డుకున్న తమపై దౌర్జన్యానికి పాల్పడటంతో ప్రాణభయంతో అక్కడి నుంచి వెళ్లిపోయామని చెప్పారు.
అనంతరం రాత్రి 1.30 గంటలకు తవణంపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదని వాపోయారు. భూమి ఆక్రమణ విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయడంతో పాటు భూమిని కాపాడాలని బాధితులు అనిల్‌కుమార్, భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు.




