Chittoor: ఉమ్మడి చిత్తూరు సీనియర్ సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక పోటీలు
Chittoor: చిత్తూరు పీవీకేఎన్ కళాశాల మైదానంలో ఉమ్మడి చిత్తూరు సీనియర్ సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక పోటీలు; 20 మంది పురుషులు, 20 మంది మహిళల ఎంపిక.
Chittoor: ఉమ్మడి చిత్తూరు సీనియర్ సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక పోటీలు
చిత్తూరు: చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ పురుషులు, మహిళల సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా సాఫ్ట్‌బాల్ చైర్మన్ పి. షణ్ముగం ప్రారంభించి క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 130 మంది క్రీడాకారులు పాల్గొనగా, ప్రతిభ ఆధారంగా 20 మంది పురుషులు, 20 మంది మహిళలను జిల్లా శిక్షణ శిబిరానికి ఎంపిక చేశారు.
శిక్షణ అనంతరం ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 12 నుంచి 14 వరకు జరిగే 13వ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.ఈ సందర్భంగా షణ్ముగం మాట్లాడుతూ, చిత్తూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు.
18 జిల్లాల నుంచి సుమారు 1,200 మంది క్రీడాకారులు హాజరుకానున్నందున వసతి, భోజనం, క్రీడా మైదాన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ చందు, కార్యదర్శి మల్లీశ్వరి, పీడీలు రమేష్, డాక్టర్ కృష్ణ, దేవానంద్, శరత్‌బాబు, లోకేష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.




