Chittoor: గువ్వగల్లు సర్పంచ్ అభ్యర్థిగా శశికళ మూర్తి నామినేషన్

Chittoor: చిత్తూరు రూరల్ గువ్వగల్లు సర్పంచ్ అభ్యర్థిగా శశికళ మూర్తి నామినేషన్; తాగునీరు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టి గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని హామీ.

Chandra Sekhar, Chittoor
Published on: 21 Nov 2026 9:30 PM IST
Chittoor
X

Chittoor: గువ్వగల్లు సర్పంచ్ అభ్యర్థిగా శశికళ మూర్తి నామినేషన్

చిత్తూరు: చిత్తూరు రూరల్ మండలం గువ్వగల్లు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారు శశికళ మూర్తి శనివారం నామినేషన్ దాఖలు చేశారు.గువ్వగల్లు సచివాలయంలో తన మద్దతుదారులతో కలిసి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా శశికళ మూర్తి మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీల మద్దతుతో, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆశీస్సులతో పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.తనను సర్పంచ్‌గా గెలిపిస్తే పంచాయతీలో నెలకొన్న మిగిలిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.

ముఖ్యంగా తాగునీటి సమస్య పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, మురుగునీటి కాలువల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు తనకు అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించాలని శశికళ మూర్తి విజ్ఞప్తి చేశారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor