Chittoor: చిత్తూరు రూరల్ ఎంపీపీగా ఆర్. జయచంద్ర నాయుడు ప్రమాణ స్వీకారం
Chittoor: చిత్తూరు రూరల్ ఎంపీపీగా ఆర్. జయచంద్ర నాయుడు, వైస్ ఎంపీపీగా లావణ్య ప్రమాణ స్వీకారం చేశారు; ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ హాజరు.
Chittoor: చిత్తూరు రూరల్ ఎంపీపీగా ఆర్. జయచంద్ర నాయుడు ప్రమాణ స్వీకారం
చిత్తూరు: చిత్తూరు రూరల్ మండల పరిషత్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఎంపీపీ ఆర్. జయచంద్ర నాయుడు, పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు భారీ ర్యాలీగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీగా ఆర్. జయచంద్ర నాయుడు, వైస్ ఎంపీపీగా లావణ్యతో పాటు ఇతర ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు సమష్టి కృషితో విజయాలు సాధించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేసి కూటమి పార్టీలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.ఎన్నికల్లో పదవులు దక్కని వారు నిరాశ చెందకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ఎంపీపీ కార్యాలయాన్ని ప్రారంభించగా, ఎంపీపీగా ఆర్. జయచంద్ర నాయుడు బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు మంజుల, చిత్తూరు మేయర్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, కూటమి నాయకులు చంద్రప్రకాష్, శశికర్ బాబు తదితరులు పాల్గొన్నారు.




