Chittoor: ముత్తుకూరు ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు విజయం!

Chittoor: చిత్తూరు రూరల్ మండలం ముత్తుకూరు సెగ్మెంట్ ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు 556 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Chandra Sekhar, Chittoor
Published on: 7 Nov 2026 6:41 PM IST
Chittoor
X

Chittoor: ముత్తుకూరు ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు విజయం!

చిత్తూరు: చిత్తూరు రూరల్ మండలం ముత్తుకూరు సెగ్మెంట్ ఎంపీటీసీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయచంద్ర నాయుడు 556 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.ఓట్ల లెక్కింపులో ఆధిక్యత సాధించిన ఆయన విజయాన్ని పార్టీ శ్రేణులు, మద్దతుదారులు స్వాగతించారు.

ఈ సందర్భంగా జయచంద్ర నాయుడు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎంపీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు కూటమి నాయకులకు, టీడీపీ కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తనను ఆదరించి, ఓట్లు వేసి గెలిపించిన ముత్తుకూరు సెగ్మెంట్ ఓటర్లకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సెగ్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor