Chittoor: మొగిలీశ్వర ఆలయ అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు
Chittoor: మొగిలీశ్వర ఆలయ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఆలయ అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
Chittoor: మొగిలీశ్వర ఆలయ అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు
చిత్తూర్: మొగిలి శ్వర దేవాలయం అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేని పూర్ణకుంభముతో స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున రెండు కోట్ల రూపాయలు మంజూరు ఎమ్మెల్యే.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ చోళ రాజుల కాలంలో నిర్మించిన అతి పురాతన దేవాలయం మొగిలి శ్వర దేవాలయం ఇక్కడ స్వామి అమ్మవారు దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని పురాణాలలో తెలుపబడిందని తెలిపారు. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న మొగిలి శ్వర దేవాలయం మరింతగా అభివృద్ధి చెంది భక్తులు దర్శించి ధరించుకునే విధంగా ఆలయ కమిటీని నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఆలయం అనుబంధంగా ఉన్న దేవరకొండకు సిమెంట్ రోడ్డు మంజూరు చేశామని, కొండపైన కళ్యాణ మండపాలు నిర్మించి, భక్తులకు ఆహ్లాదకర వాతావరణ కల్పించి భక్తులకి స్వామివారిపైన భక్తి విశ్వాసం పెంచే విధంగా అభివృద్ధి చేయాలనిఆలయ కమిటీకి సూచించారు.
ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కమల్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి పది కోట్ల రూపాయలు మంజూరు చేయవలసిందిగా కోరడమైందని ,అందులో భాగంగా మొదటి విడతగా రెండు కోట్ల రూపాయలు స్థానిక ఎమ్మెల్యే కృషి ద్వారా మంజూరు అయిందని తెలిపారు.
ప్రస్తుతానికి ప్రభుత్వంఆలయ అభివృద్ధికి మంజూరు చేసిన రెండు కోట్ల రూపాయలతో మొదటగా ఆలయ కోనేరు, ఆలయ ప్రాకారము, భక్తుల సౌకర్యం కొరకు ఆధునిక మరుగుదొడ్లు నిర్మాణం పై దృష్టి సారించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కమల్ నాథ్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం టిడిపి మండల అధ్యక్షులు ధరణి నాయుడు, మాజీ అధ్యక్షులు జయ ప్రకాష్ నాయుడు, పూతలపట్టు టిడిపి మండల కన్వీనర్ దొరబాబు చౌదరి, తవణంపల్లిటిడిపి మండల కన్వీనర్ వెంకటేశ్వర చౌదరి, చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొన్నారు.




