Puthalapattu: పూతలపట్టును అభివృద్ధి చేస్తా.. ఉంగరం గుర్తుకు ఓటేయండి: మురళి!

Puthalapattu: చిత్తూరు జిల్లా పూతలపట్టు సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్న గుంటూరు మురళి బజారు వీధి, ముస్లిం వీధి, రామాపురం వీధుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

VASU, PUTTALAPATTU
Published on: 26 Nov 2026 2:05 PM IST
Puthalapattu
X

Puthalapattu: పూతలపట్టును అభివృద్ధి చేస్తా.. ఉంగరం గుర్తుకు ఓటేయండి: మురళి!

పూతలపట్టు: పూతలపట్టు సర్పంచిగా ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్న గుంటూరు మురళి పూతలపట్టు మండల కేంద్రంలోని పూతలపట్టు బజారు వీధి ,ముస్లిం వీధి, హై రోడ్డు, రామాపురం వీధులలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మురళి ప్రచార కార్యక్రమంలో యువత ఉంగరం గుర్తు గల బనీన్లు వేసుకుని ఓటర్లను ఆకర్షించారు. ఈ సందర్భంగా ముస్లిం వీధిలోని మహిళలు ముస్లిం యువత ఆయనకు పూలమాలను వేసి కర్పూర హారతులు ఇచ్చారు.

ఈ సందర్భంగా గుంటూరు మురళి మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా పూతలపట్టును అభివృద్ధి చేసి ఎవరికి ఏ కష్టం వచ్చిన నేను ఉన్నాను అని ప్రజలకు భరోసా ఇచ్చారు . ఈ ప్రచార కార్యక్రమంలో పూతలపట్టు మాజీ సర్పంచ్ ఇందిర తెలుగుదేశం సీనియర్ నాయకులుచంద్రమౌళి పలువురు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU