Chittoor: జిల్లా జైలులో ఘనంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం
Chittoor: చిత్తూరు జిల్లా జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్, జడ్జి భారతి పాల్గొని ఖైదీలకు హితవు పలికారు.
Chittoor: జిల్లా జైలులో ఘనంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం
చిత్తూరు: మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం చిత్తూరు జిల్లా కారాగారంలో ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, DLSA కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎస్. భారతి, జైలు సూపరింటెండెంట్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, ఖైదీల సంక్షేమం, పునరావాసానికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. జైలులో మౌలిక సదుపాయాల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని, న్యాయపరమైన ఇబ్బందులకు అవసరమైన సహాయం అందిస్తామని పేర్కొన్నారు.
ఖైదీలు గాంధీజీ బోధించిన సత్యం, అహింస సిద్ధాంతాలను ఆచరిస్తూ, గత తప్పుల నుంచి మార్పు పొంది విడుదలైన తర్వాత బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సూచించారు. ఆర్థిక ప్రయోజనాల కోసం ఇతరులు చేసిన నేరాలను తమపై వేసుకోవద్దని హితవు పలికారు.సీనియర్ సివిల్




