Chittoor: ఆర్నబ్ తుఫాను సహాయక చర్యలకు 110 మంది విద్యుత్ సిబ్బంది!

Chittoor: ఆర్నబ్ తుఫాను ముప్పుతో పశ్చిమ గోదావరికి చిత్తూరు విద్యుత్ శాఖ సిబ్బంది. 10 మంది ఇంజినీర్లు, 100 మంది కార్మికులు తరలివెళ్తున్నట్లు SE అమరబాబు వెల్లడి.

Chandra Sekhar, Chittoor
Published on: 26 Oct 2026 4:03 PM IST
Chittoor
X

Chittoor: ఆర్నబ్ తుఫాను సహాయక చర్యలకు 110 మంది విద్యుత్ సిబ్బంది!

చిత్తూరు: ఆర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం చిత్తూరు జిల్లా నుంచి విద్యుత్ శాఖ సిబ్బందిని పశ్చిమ గోదావరి జిల్లాకు తరలిస్తున్నట్లు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ అమరబాబు తెలిపారు.

సోమవారం ఆయన మాట్లాడుతూ, తుపాను ఈ నెల 27వ తేదీ రాత్రి లేదా 28వ తేదీ ఉదయం తీరం దాటే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

తుపాను సహాయక చర్యల కోసం 10 మంది ఇంజినీర్లు, 100 మంది కార్మికులు అవసరమైన వాహనాలు, విద్యుత్ పరికరాలతో తరలివెళ్తున్నట్లు చెప్పారు.

విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేందుకు ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.

చిత్తూరు జిల్లాలోనూ ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని అమరబాబు పేర్కొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor