Chittoor: ఘనంగా పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

Chittoor: చిత్తూరులో ఘనంగా పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి మిఠాయిలు పంపిణీ చేసిన బీజేపీ నేతలు.

Chandra Sekhar, Chittoor
Published on: 25 Sept 2026 5:41 PM IST
Chittoor
X

Chittoor: ఘనంగా పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

చిత్తూరు: భారతీయ జన సంగ్ వ్యవస్థాపకులు పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు చిత్తూరు సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు నగరం లో ఘనంగా నిర్వహించారు.

స్థానిక టీవీ నాయుడు వీధిలో పండిట్ దీనదయాల్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలకు మూలం దీన దయాళ్ అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి దుస్తులు, తీపి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, రామభద్ర, రవి, చిన్ని తదితరులు పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor