Chittoor: అత్తమామల ఆశయాల సాధనకు కృషి చేస్తా: మేయర్ కటారి హేమలత!
Chittoor: మాజీ మేయర్ దివంగత కటారి అనురాధ, మోహన్‌ల వర్ధంతి సందర్భంగా గంగనపల్లిలో నివాళులర్పించిన చిత్తూరు నూతన మేయర్ కటారి హేమలత, వారి ఆశయాల సాధనకు కృషి చేస్తానన్నారు.
Chittoor: అత్తమామల ఆశయాల సాధనకు కృషి చేస్తా: మేయర్ కటారి హేమలత!
చిత్తూరు:మాజీ మేయర్ దివంగత కటారి అనురాధ, మోహన్‌ల సేవా స్ఫూర్తితో ప్రజలకు అంకితభావంతో సేవ చేస్తానని చిత్తూరు నగర నూతన మేయర్ కటారి హేమలత పేర్కొన్నారు.మాజీ మేయర్ కటారి అనురాధ, మోహన్‌ల వర్ధంతి సందర్భంగా గంగనపల్లిలోని వారి సమాధుల వద్ద చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మేయర్ కటారి హేమలత, కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లోని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ, అత్తమామలే తమకు మార్గదర్శకులని, వారు చూపిన బాటలోనే నడుస్తూ ప్రజాసేవకు అంకితమవుతానని తెలిపారు. ప్రజల కోసం వారు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవ చేశారని, వారి ఆశయాల సాధన కోసం తాను కూడా నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ నెల 23న మేయర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




