Chittoor: నారగల్లులో సర్పంచ్ అభ్యర్థి కనిమొయి విస్తృత ప్రచారం

Chittoor: చిత్తూరు గుడిపాల మండలం నారగల్లు సర్పంచ్ అభ్యర్థి కనిమొయి, దాము ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ కుళాయి నీరు, మౌలిక వసతులపై హామీ. మంచం గుర్తుకు ఓటు అభ్యర్థన.

Chandra Sekhar, Chittoor
Published on: 29 Nov 2026 8:50 PM IST
Chittoor
X

Chittoor: నారగల్లులో సర్పంచ్ అభ్యర్థి కనిమొయి విస్తృత ప్రచారం

చిత్తూరు: గ్రామ ప్రజలు తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చిత్తూరు నియోజక వర్గం గుడిపాల మండలం నారగల్లు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కనిమొయి, దాము హామీ ఇచ్చారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సహకారంతో గ్రామంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.

ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు, సీసీ రోడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేసి గ్రామ సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. డిసెంబర్ 2న జరిగే ఎన్నికల్లో మంచం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor