Nagari: నగరి సబ్-డివిజన్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ!
Nagari: మూడో దశ గ్రామ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో చిత్తూరు జిల్లా నగరి సబ్-డివిజన్‌లోని నామినేషన్ కేంద్రాలను అడిషనల్ ఎస్పీ ఎస్. షాను పరిశీలించారు.
Nagari: నగరి సబ్-డివిజన్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ!
నగరి: గ్రామ సర్పంచ్ ఎన్నికల మూడో దశ నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆదేశాల మేరకు నగరి సబ్-డివిజన్ పరిధిలోని పలు నామినేషన్ కేంద్రాలను అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ఎస్. షాను సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద చేపట్టిన పోలీసు భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు, పరిస్థితులను సమీక్షించి, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు, అభ్యర్థులు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా, సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అడిషనల్ ఎస్పీ ఆపరేరేషన్ సూచించారు.




