Nagari: నగరిలో అక్రమ రేషన్ బియ్యం దందా బట్టబయలు.. 16 టన్నులు సీజ్!

Nagari: చిత్తూరు జిల్లా నగరి కీళపట్టు సమీపంలోని గోడౌన్‌పై పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడి చేసి 16 టన్నుల అక్రమ రేషన్ బియ్యం, 6 వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 25 Nov 2026 9:32 AM IST
Nagari
X

Nagari: నగరిలో అక్రమ రేషన్ బియ్యం దందా బట్టబయలు.. 16 టన్నులు సీజ్!

నగరి: నగరి మున్సిపాలిటీ పరిధిలోని కీళపట్టు గ్రామం ఎదురుగా ఉన్న ఓ బియ్యం గోడౌన్‌పై మంగళవారం ఉదయం పోలీసులు, రెవెన్యూ అధికారుల సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 16 టన్నుల పీడీఎస్ (PDS) రేషన్ బియ్యాన్ని, తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఆరు వాహనాలను అధికారులు గుర్తించి సీజ్ చేశారు.

ఈ గోడౌన్ అమృతరాజు అలియాస్ టి.ఆర్.ఎస్&నాటార్‌కు చెందినదిగా కేసులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 109/2026 కింద అత్యవసర వస్తువుల చట్టం (Essential Commodities Act) సెక్షన్ 7(1) ప్రకారం కేసు నమోదు చేశారు.

స్థానికంగా వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం, రాత్రి 9 గంటల తర్వాత రేషన్ బియ్యం తరలింపు జరుగుతోందని, కొందరు రేషన్ డీలర్లు ప్రజలకు అందించాల్సిన బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA