Chittoor: చిత్తూరులో 'యువత భవితకు భరోసా' కార్యక్రమం

Chittoor: చిత్తూరులో 'యువత భవితకు భరోసా' కార్యక్రమం. విద్యార్థులు ప్రలోభాలకు లొంగకుండా చదువుపై దృష్టి పెట్టాలని ఎంపీ దగ్గుమల్ల, ఎమ్మెల్యే జగన్‌మోహన్ పిలుపు.

Chandra Sekhar, Chittoor
Updated on: 28 Sept 2026 5:10 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరులో 'యువత భవితకు భరోసా' కార్యక్రమం

చిత్తూరు: విద్యార్థులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఉన్నత చదువులపై దృష్టి సారించి, తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు సూచించారు.సోమవారం చిత్తూరులోని అపోలో యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమానికి ఆయన ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.విద్యార్థులు తమ సామర్థ్యాలను పెంపొందించుకుని అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అపోలో యూనివర్సిటీ ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతోందని పేర్కొన్నారు.కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డా. నితిన్‌ ఎం. నాగార్కర్‌, ప్రో వైస్‌ ఛాన్సలర్‌ డా. అల్ఫ్రెడ్‌ జే. ఆగస్టిన్‌, రిజిస్ట్రార్‌ అనిల్‌ కుమార

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor