Chittoor: టూ వీలర్ మెకానిక్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండ!
Chittoor: చిత్తూరు టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.
Chittoor: టూ వీలర్ మెకానిక్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండ!
Chittoor: టూ వీలర్ మెకానిక్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవ సభను ఆదివారం స్థానిక అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో మొబైల్ రంగం లో మెకానిక్ పాత్ర కీలకం అన్నారు. నూతన టెక్నాలజీ అధికం అవుతున్న నేపధ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల మరమ్మత్తు పనులపై మెకానిక్లు నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే ను అసోసియేషన్ తరపున సత్కరించారు. ఈ కార్యక్రమంలో టూ వీలర్ మెకానిక్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు మురుగన్, నాయకులు మున్నా, బాలచంద్ర, షణ్ముగ రెడ్డి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.




