Chittoor: 2019-24 నాటి అక్రమాలపై విచారణ జరపాలి: ఎమ్మెల్యే జగన్‌మోహన్

Chittoor: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక, క్వారీ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ కలెక్టర్, ఎస్పీలను డిమాండ్ చేశారు.

Chandra Sekhar, Chittoor
Published on: 22 Sept 2026 7:52 PM IST
Chittoor
X

Chittoor: 2019-24 నాటి అక్రమాలపై విచారణ జరపాలి: ఎమ్మెల్యే జగన్‌మోహన్

చిత్తూరు: 2019–24 మధ్య చిత్తూరు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమ క్వారీలు, అక్రమ వసూళ్లు, ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ కోరారు.

తనపై, తన పీఏపై వస్తున్న క్వారీ ఆరోపణలను ఖండించారు. తాను ఒక్క క్వారీ నిర్వహించి సంపాదించినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ చేశారు. రాజకీయాల్లోకి తాను ఆశయం, తన తండ్రికి ఇచ్చిన మాటతో వచ్చానన్నారు.

చిత్తూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కలెక్టర్‌, ఎస్పీ విచారణ జరిపి ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వాలని కోరారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor