Chittoor: చిత్తూరు జెడ్పీ చైర్‌పర్సన్‌గా మందలపు శైలజ బాధ్యతల స్వీకరణ
Chittoor: చిత్తూరు జెడ్పీ చైర్‌పర్సన్‌గా మందలపు శైలజ తేజమూర్తి బాధ్యతల స్వీకరణ; హాజరై శుభాకాంక్షలు తెలిపిన పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్.
Chittoor: చిత్తూరు జెడ్పీ చైర్‌పర్సన్‌గా మందలపు శైలజ బాధ్యతల స్వీకరణ
చిత్తూరు: చిత్తూరు జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్‌గా శ్రీమతి మందలపు శైలజ తేజమూర్తి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంలో, చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన జెడ్పీ చైర్‌పర్సన్ శైలజ తేజమూర్తి గారికి పుష్పగుచ్ఛం అందజేసి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఆమె నాయకత్వంలో జిల్లా పరిషత్ మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




