Chittoor: జర్నలిస్టుల సంక్షేమమే జాప్ ప్రధాన లక్ష్యం: నేతలు!
Chittoor: జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్యదర్శి ఎన్. లక్ష్మీపతి, జిల్లా అధ్యక్షుడు ఫైరోజ్ భాష తెలిపారు.
Chittoor: జర్నలిస్టుల సంక్షేమమే జాప్ ప్రధాన లక్ష్యం: నేతలు!
చిత్తూరు: జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) ప్రధాన లక్ష్యమని అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్. లక్ష్మీపతి, జిల్లా అధ్యక్షుడు ఫైరోజ్ భాష తెలిపారు.జాప్ 34వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని తపోవనం బుద్ధిమాంద్య ఆశ్రమంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆశ్రమంలోని వారితో కలిసి కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులను తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ మార్గదర్శకత్వంలో సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జ్ఞాన ప్రకాష్, కార్యదర్శి లవకుమార్, కార్యవర్గ సభ్యులు నవాజ్, సంపత్, చిట్టిబాబు, దినేష్ కుమార్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




