Gudipala: గుడిపాల జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన నేత పగడాల భారతి నామినేషన్

Gudipala: గుడిపాల జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జనసేన నేత పగడాల భారతి. చిత్తూరు జెడ్పీ ఆఫీసులో నామినేషన్ అందజేత. భారీగా తరలివచ్చిన జనసైనికులు.

Chandra Sekhar, Chittoor
Published on: 21 Oct 2026 7:12 PM IST
Gudipala
X

Gudipala: గుడిపాల జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన నేత పగడాల భారతి నామినేషన్

గుడిపాల: చిత్తూరు జిల్లా గుడిపాల మండల జనసేన పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా పగడాల భారతి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా పగడాల భారతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తన విజయానికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గుడిపాల మండల ప్రజలు తనను జడ్పీటీసీ అభ్యర్థిగా ఆదరించి, ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పగడాల శశికాంత్,

నామినేషన్ కార్యక్రమం సందర్భంగా జనసైనికులు, మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor