Chittoor: సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో నిలిచిన డి. సత్యప్రభ!

Chittoor: శ్రీనివాస ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ డి. సత్యప్రభ 6వ వర్ధంతి వేడుకలను చిత్తూరు రుక్మిణి కృష్ణస్వామి విద్యాలయ జూనియర్, డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు.

Chandra Sekhar, Chittoor
Published on: 19 Nov 2026 6:06 PM IST
Chittoor
X

Chittoor: సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో నిలిచిన డి. సత్యప్రభ!

చిత్తూరు: శ్రీనివాస ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ డి. సత్యప్రభ 6వ వర్ధంతి వేడుకలను స్థానిక రుక్మిణి కృష్ణస్వామి విద్యాలయ జూనియర్, డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎం. రమేష్ మాట్లాడుతూ డి. సత్యప్రభ చేసిన సేవలను స్మరించుకున్నారు. శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి సదుపాయాలు కల్పించి జలదాతగా నిలిచారని కొనియాడారు.

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో అవసరమైన వసతులతో తెలుగు విద్యాలయాలను నిర్మించి విద్యాదాతగా గుర్తింపు పొందారని తెలిపారు. అలాగే నాణ్యమైన వైద్య సదుపాయాలతో ఆసుపత్రిని నిర్మించి ఎంతోమందికి ఆరోగ్య సేవలు అందించిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు.సమాజ సేవే లక్ష్యంగా విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ సందర్భంగా సభలో పాల్గొన్న వారంతా నిలబడి ఆమె సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.

వర్ధంతిని పురస్కరించుకుని తపోవనం వృద్ధాశ్రమం, నిరాశ్రయుల ఆశ్రయం కేంద్రాల్లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.అనంతరం కళాశాల అధ్యాపక బృందం డి. సత్యప్రభ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor