Chittoor: చిత్తూరులో ఉత్సాహంగా జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ పోటీలు!

Chittoor: చిత్తూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మెసానికల్ గ్రౌండ్‌లో జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు. 42 మంది దివ్యాంగ క్రీడాకారులు పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor
Published on: 16 Nov 2026 5:30 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరులో ఉత్సాహంగా జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ పోటీలు!

చిత్తూరు: దివ్యాంగుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయాలనే లక్ష్యంతో చిత్తూరులో జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ సెలక్షన్‌ పోటీలను నిర్వహించారు.జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నవంబర్‌ 16న చిత్తూరులోని మెసానికల గ్రౌండ్‌లో ఉదయం 9 గంటలకు ఈ పోటీలు ప్రారంభమయ్యాయి.

ఈ పోటీల్లో మొత్తం 42 మంది దివ్యాంగ క్రీడాకారులు పాల్గొన్నారు.వీరిలో 27 మంది బాలురు,పురుషులు కాగా,15 మంది బాలికలు, మహిళలు ఉన్నారు.ఈ పోటీలను ఆరు క్రీడాంశాల్లో నిర్వహించారు. పారా అథ్లెటిక్స్‌, పారా బ్యాడ్మింటన్‌, వీల్‌చైర్‌ ఫెన్సింగ్‌,బ్లైండ్‌ గోల్‌బాల్‌, పారా తైక్వాండో, టేబుల్‌ టెన్నిస్‌ విభాగాల్లో బాలురు, బాలికలు తమ ప్రతిభను ప్రదర్శించారు.

జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులకు ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్‌ 2వ తేదీ వరకు రాష్ట్ర, జాతీయ స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి. ఉదయ భాస్కర్‌ తెలిపారు. అలాగే డిసెంబర్‌ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor