Chittoor: స్వస్తిక్ నగర్‌లో కలెక్టర్ సుమిత్ కుమార్ పింఛన్ల పరిశీలన

Chittoor: పూతలపట్టు నియోజకవర్గం మాధవరం పంచాయతీ స్వస్తిక్ నగర్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయంగా పరిశీలించారు.

VASU, PUTTALAPATTU
Published on: 1 Oct 2026 7:06 PM IST
Chittoor
X

Chittoor: స్వస్తిక్ నగర్‌లో కలెక్టర్ సుమిత్ కుమార్ పింఛన్ల పరిశీలన

Chittoor: గురువారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని, లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగ కలెక్టర్ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నెలనెలా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారా, ఎవరైనా డబ్బులు ఆడిగారా అంటూ ఆరా తీశారు.

పెన్షన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU