Chittoor: ఘనంగా బీసీ సంక్షేమ సంఘం నేత పి. షణ్ముగం జన్మదిన వేడుకలు

Chittoor: చిత్తూరులో ఘనంగా పి. షణ్ముగం జన్మదిన వేడుకలు. కాణిపాకంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి.

Chandra Sekhar, Chittoor
Published on: 26 Sept 2026 8:00 PM IST
Chittoor
X

Chittoor: ఘనంగా బీసీ సంక్షేమ సంఘం నేత పి. షణ్ముగం జన్మదిన వేడుకలు

చిత్తూరు: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ పి. షణ్ముగం జన్మదిన వేడుకలు శనివారం చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు,బీసీ సంక్షేమ సంఘం నాయకులు,పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

జన్మదినాన్ని పురస్కరించుకుని పి. షణ్ముగం శనివారం ఉదయం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.అనంతరం చిత్తూరులోని ఏఎస్ఎం మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయానికి చేరుకున్నారు.

అక్కడ సంఘం నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు షణ్ముగానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనతో తమ అనుబంధాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు పి. షణ్ముగంను శాలువాలతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor