Chittoor: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్‌కు వినతిపత్రం

Chittoor: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్‌కు APUWJ, ప్రెస్ క్లబ్ నేతల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

Chandra Sekhar, Chittoor
Published on: 2 Oct 2026 5:37 PM IST
Chittoor
X

Chittoor: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్‌కు వినతిపత్రం

చిత్తూరు: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ APUWJ జిల్లా అధ్యక్షుడు లోకనాథన్, చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ బాబు, కార్యదర్శి కాళేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ సుమిత్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం, కొత్త వేతన బోర్డు, ఇళ్ల స్థలాల కల్పన, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, సీనియర్ జర్నలిస్టులకు పింఛన్లు, రైల్వే ప్రయాణ రాయితీల పునరుద్ధరణ తదితర డిమాండ్లను వినతిపత్రంలో పేర్కొన్నారు.

జర్నలిస్టులపై దాడులను అరికట్టి, ఉద్యోగాలు కోల్పోయిన వర్కింగ్ జర్నలిస్టుల హక్కులను పునరుద్ధరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ కుమార్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు శివప్రసాద్, ఫోటో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు శివకుమార్, పవన్ కుమార్ జై ప్రకాష్,నరేష్ ,చంద్రప్రకాష్ ,చంద్రశేఖర్, జైకర్, అప్పు, రమేష్,విటల్ కృష్ణ సింగ్ మరియు ఏపీడబ్ల్యూజే జిల్లా నాయకులు, ప్రెస్ క్లబ్ కమిటీ పాత్రికేయమితులు పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor