Chittoor: వైద్య పరిశోధనల్లో గణాంక విశ్లేషణ కీలకం: వైద్య నిపుణులు!
Chittoor: చిత్తూరులోని అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లో మంగళవారం బయోస్టాటిస్టిక్స్, గుణాత్మక పరిశోధన అంశాలపై అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు.
Chittoor: వైద్య పరిశోధనల్లో గణాంక విశ్లేషణ కీలకం: వైద్య నిపుణులు!
చిత్తూరు: వైద్య పరిశోధనల్లో నాణ్యత, విశ్వసనీయత పెంపొందించేందుకు గణాంక విశ్లేషణ, శాస్త్రీయ పరిశోధనా పద్ధతులపై అవగాహన అవసరమని వైద్య నిపుణులు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో చిత్తూరులోని అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఏఐఎంఎస్‌ఆర్)లో మంగళవారం బయోస్టాటిస్టిక్స్, గుణాత్మక పరిశోధన అంశాలపై ఒకరోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఏఐఎంఎస్‌ఆర్ ఫ్యాకల్టీ రీసెర్చ్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల డీన్ డా. రమ్యా రామకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై, వైద్య రంగంలో పరిశోధనల ప్రాధాన్యతను వివరించారు. అధ్యాపకులు శాస్త్రీయ దృక్పథంతో పరిశోధనలను అభివృద్ధి చేయాలని సూచించారు. జిప్మర్ పుదుచ్చేరి ఫార్మకాలజీ విభాగానికి చెందిన డా. ఆర్. మృణాళిని బయోస్టాటిస్టిక్స్‌పై, ఎస్‌ఎంవీఎంసీహెచ్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డా. అమోల్ ఆర్. డోంగ్రే గుణాత్మక పరిశోధనా విధానాలపై శిక్షణ ఇచ్చారు.
కార్యక్రమానికి ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్‌గా డా. పి. విజేత, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డా. సి. శ్రావణ దీప్తి వ్యవహరించారు. ఎపిఎంసి పరిశీలకుడు డా. నిరంజన్‌తో పాటు వైద్య అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.




