Chittoor: చిత్తూరు జిల్లాలో లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

Chittoor: చిత్తూరు జిల్లాలో 18 మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా ఎంపిక నిర్వహించగా, కలెక్టర్ సునీత్ కుమార్ చేతుల మీదుగా 16 దుకాణాలు కేటాయించారు.

Chandra Sekhar, Chittoor
Published on: 8 Oct 2026 6:26 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరు జిల్లాలో లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

Chittoor: చిత్తూరు జిల్లాకు సంబంధించి 18 మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక విధానాన్ని నిర్వహించినట్లు ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ తెలిపారు.ఆయన మీడియాకు వెల్లడిస్తూ మొత్తం కల్లుగీత కార్మికులకు ఒకటి, ఓపెన్ క్యాటగిరిలో మిగిలిన దుకాణాలకు టెండర్ ఆహ్వానించగా కల్లుగీత కార్మికులకు ఎవరు దరఖాస్తు చేసుకోలేదని, ఓపెన్ క్యాటగిరిలో 16 షాపులకు గాను 74 దరఖాస్తులు రాగా లాటరీ పద్ధతి ద్వారా జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ చేతులమీదుగా మద్యం దుకాణాలను కేటాయించడం జరిగిందన్నారు.వి కోటకు చెందిన రెండు మద్యం దుకాణాలకు ఇటువంటి అప్లికేషన్ లు రాలేదు అని రెండు దుకాణాలకు సంబంధించి త్వరలో టెండర్ల పిలుస్తామని తెలిపారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor