Chintoor: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

Chintoor: చింతూరు, కూనవరంలలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశాలు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పిలుపు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 17 Sept 2026 6:10 AM IST
Chintoor
X

Chintoor: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

చింతూరు: స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మరియు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు.విలీన మండలాలు అయిన చింతూరు,కూనవరం లలో మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశం కార్యక్రమాలు నిర్వహించారు.

మండల పార్టీ అధ్యక్షులు ఎడవల్లి భాస్కర రావు మరియు జమాల్ ఖాన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు.నియోజక వర్గ పార్టీ పరిశీలకులు కోట్ని బాలాజీ మరియు స్థానిక సంస్థలు ఎన్నికల పరిశీలకులు కడుపూడి సత్తిబాబు ల సౌజన్యంలో నిర్వహించిన సమావేశాల్లో తొలుత ఆమెకు పార్టీ శ్రేణులు అభిమానులు సాదర స్వాగతం పలికారు.

అనంతరం నిర్వహించిన మండల పార్టీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం లో ఆమె మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని సూచించారు.పార్టీలో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తను గుర్తించి వారి రాజకీయ భవిష్యత్తుకు మంచి బాటలు వేయడం జరుగుతుందని అన్నారు.త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన విధి విధానాల పై క్షుణ్ణంగా వివరించారు.

ప్రతి బూత్ లో అత్యధిక మెజారిటీ ఓట్లు సాధించేలా కృషి చేయాలని సూచించారు.దానికి గానూ తనవంతుగా ఏమి చేయాలో అంతా చిత్తశుద్ధితో పనిచేస్తానని హమీ ఇచ్చారు.ఇప్పటికే పోలవరం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల హామీలు మేరకు అన్నింటినీ అమలు చేసినట్లు పేర్కొన్నారు.ఇంకా ఎన్నికల్లో ఇవ్వని హామీలు కూడా అమలు చేసిన ఘనత కూటమిదే అన్నారు. ఐకమత్యంగా ఉంటూ కూటమి ధర్మాన్ని పాటిద్దాం అని అన్నారు.

కార్యకర్తలకు సముచిత స్థానం అందించే పార్టీ తెదేపా అని నియోజక వర్గ స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు కడుపూడి సత్తిబాబు మరియు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కోట్ని బాలాజీ లు స్పష్టం చేశారు.చింతూరు, కూనవరం మండలాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో వారు పలు సూచనలు సలహాలు చేశారు.త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని కోరారు.ప్రతీ కార్యకర్త కష్టం తనకు తెలుసని వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.కార్యకర్తలు వారు కష్టపడ్డ విధానాల ప్రకారం వారికి గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.అధిష్టానం ఆదేశాలు ప్రకారం కూటమికి కేటాయించిన స్థానాలను వారికి కేటాయించి మిగిలిన స్థానాల్లో పోటీచేయాల్సి ఉంటుందన్నారు.ఆయా స్థానాల్లో పోటీచేసే ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలతో త్వరలో రంపచోడవరం లో ఏర్పాటు చేసే సమావేశానికి ఆశావహులు అందరూ హాజరు కావాలని కోరారు.విలీన మండలాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఉత్సాహం ఆశాజనకంగా ఉందని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు.కూనవరం మండలం ముల్లూరు మరియు రేపాక గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షులు ఎడవల్లి భాస్కర రావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా స్తూపం ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఆయా కార్యక్రమాలకు హాజరైన ఆమెకు పార్టీ శ్రేణులు అభిమానులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆమెచేతులు మీదుగా తెలుగుదేశం పార్టీ జెండా స్తూపం ఆవిష్కరణ చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ వార్డులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు,చిన్నం బాబురమేష్,వంతల రాజేశ్వరి, APIIC డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు, మండల పార్టీ అధ్యక్షులు ఎడవల్లి భాస్కర రావు,షేక్ జమాల్ ఖాన్,జడ్పీటీసీ వాళ్ళ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR