Chintoor: ముంపు బాధితులకు పూర్తి పరిహారం ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ప్రశాంతి

Chintoor: చింతూరులో పోలవరం ముంపు బాధితుల సమస్యలపై ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ప్రశాంతి సమీక్ష. అర్హులందరికీ 3 నెలల్లో పరిహారం అందిస్తామని హామీ.

RAJESH REDDY, CHINTOOR
Updated on: 17 Sept 2026 8:19 AM IST
Chintoor
X

Chintoor: ముంపు బాధితులకు పూర్తి పరిహారం ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ప్రశాంతి

చింతూరు: పోలవరం ప్రాజెక్ట్ వలన ముంపునకు గురవుతున్న చింతూరులో ఆర్ అండ్ ఆర్ కమిషనర్ పి ప్రశాంతి పర్యటించారు.చింతూరు ఐటిడిఏ కార్యాలయం నందు ముంపు బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పరిహారం పునరావాసం అందించడం జరుగుతుందని కమిషనర్ ప్రశాంతి హామీ ఇచ్చారు.

మీడియా సమావేశంలో ప్రశాంతి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూరు పరిధిలో 194 గ్రామాలు సుమారు 35000 కుటుంబాలను గుర్తించమని వారికి ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణం, భూ సమీకరణ 96% పూర్తయిందని కమిషనర్ పి ప్రశాంతి అన్నారు.

2022లో లైడర్ సర్వేలో 36 గ్రామాలను గుర్తించమని గిరిజన మరియు గిరిజనేతరులకు కాలనీలు ఇంటి నిర్మాణాలకు భూమి గుర్తించమని ఈ నెలాఖరు నాటికి టెండర్లు పూర్తి చేస్తామని అన్నారు.చాలామంది నిర్వాసితులు పిడిఎఫ్ లో పేర్లు రాలేదని ఫిర్యాదు చేసారని సెస్ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఎంక్వయిరీ చేసి అర్హతను బట్టి ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

41.15 కాంటూరు పరిధిలోని ముంపు ప్రజలకు మరో మూడు నెలలలో పరిహారం అందిస్తామని తెలిపారు.ఆ తరువాతే తదుపరి కాంటూరు పరిధిలోని ప్రజలకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.కాంటూరు లెక్కల ప్రకారం నిర్వాసితులకు పరిహారం పునరావాసం కల్పించుకుంటూ వస్తామని అన్నారు.నిర్వాసితులకు ఓటీఎస్ ఆప్షన్ ఇంకా కొనసాగుతుందని ఎవరైనా నిర్వాసితులు ఓటిఎస్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అని తెలిపారు.

ఓటిఎస్ పెట్టుకున్న వారికి పరిహారం చెల్లింపులు అయిపోయిన వెంటనే సెకండ్ ఆప్షన్ పెట్టుకున్న వారికి పరిహారం అందించడం జరుగుతుందని తెలిపారు.నిర్వాసితులు పరిహారం కోసం దళారులు చెప్పే మాయమాటలను నమ్మొద్దని, నమ్మి మోసపోవద్దని సూచించారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పరిహారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మీడియా సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, చింతూరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి శుభం నొక్వాల్ పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR