Madanapalle: ఎమ్మెల్యే షాజహాన్ భాషను కలిసిన బోయపాటి రంగస్వామి నాయుడు!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె 34వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన బోయపాటి రంగస్వామి నాయుడు ఎమ్మెల్యే షాజహాన్ భాషను కలిశారు. ప్రజలకు అండగా ఉంటానని వెల్లడి.

Srinivasulu, Madanapalle
Published on: 6 Nov 2026 12:12 PM IST
Madanapalle
X

Madanapalle: ఎమ్మెల్యే షాజహాన్ భాషను కలిసిన బోయపాటి రంగస్వామి నాయుడు!

Madanapalle: మదనపల్లె 34వ వార్డు కౌన్సిలర్‌గా బోయపాటి రంగస్వామి నాయుడు అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనయుడు బోయపాటి లోకేష్ నాయుడుతో కలిసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా బోయపాటి రంగస్వామి నాయుడు మాట్లాడుతూ.. 34వ వార్డు ప్రజలు తనపై నమ్మకంతో అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మదనపల్లె అభివృద్ధికి ఎమ్మెల్యే షాజహాన్ భాష నాయకత్వంలో తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle