Punganur: బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Punganur: బోయకొండ గంగమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్ మధుసూదన్ నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

MAHESH, PUNGANOOR
Published on: 12 Oct 2026 6:12 PM IST
Punganur
X

Punganur: బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

పుంగనూరు: అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన టిడిపి పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మధుసూదన్ నాయుడు కుటుంబ సభ్యులు. బోయకొండ భవాని నగర్ నందు టిడిపి నాయకులు కార్యకర్తలు ఇన్చార్జ్ మధుసూదన్ నాయుడుకు ఘనంగా భారీ గజమాలతో స్వాగతం పలికారు.

ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ ఈవో సహాయ కమిషనర్ ఏకాంబరం అధికారులు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

అమ్మవారికి ఉదయాన్నే పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకారంలో అమ్మవారిని బాల త్రిపుర సుందరీ దేవి భక్తులు దర్శించుకున్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలన సందర్భంగా ఉభయదారులచే గణపతి హోమం చండీ హోమాలను వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహించారు.

టిడిపి ఇన్చార్జ్ మధుసూదన్ నాయుడు కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారికి తీర్థ ప్రసాదాలను అందించారు. ఉభయదారులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR