Nindra: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: మాజీ మంత్రి ఆర్కే రోజా!

Nindra: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని నిండ్రలో పార్టీ కేడర్ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 11 Oct 2026 9:57 PM IST
Nindra
X

Nindra: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: మాజీ మంత్రి ఆర్కే రోజా!

నిండ్ర: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఆర్కే రోజా పిలుపునిచ్చారు.

నగరి నియోజకవర్గం నిండ్ర మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులకు రోజా చేతుల మీదుగా పార్టీ కేడర్‌ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో, ఐకమత్యంగా పనిచేయాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు.

గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రోజా సూచించారు. ఈ కార్యక్రమంలో నిండ్ర మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA