B. Kothakota: బి.కొత్తకోట ఎంపీపీగా వెంకటరమణారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

B. Kothakota: తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట ఎంపీపీగా టీడీపీ నేత వెంకటరమణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు; సుదర్శన్ రెడ్డి సత్కరించారు.

Srinivasulu, Madanapalle
Published on: 20 Nov 2026 4:24 PM IST
B. Kothakota
X

B. Kothakota: బి.కొత్తకోట ఎంపీపీగా వెంకటరమణారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

బి.కొత్తకోట: తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట మండల పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటరమణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి ఆయనకు డిక్లరేషన్ పత్రాన్ని అందజేయగా, అనంతరం ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు టి. సుదర్శన్ రెడ్డి నూతన ఎంపీపీ వెంకటరమణారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందని, వెంకటరమణారెడ్డికి ఎంపీపీ పదవి దక్కడం ఇందుకు నిదర్శనమని అన్నారు.

తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జి. శంకర్ యాదవ్ సహకారంతో బి.కొత్తకోట మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సాధించిన ఫలితాల తరహాలోనే త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు అన్ని స్థానాల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle